కొత్తపేట: వాడపాలెంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. శనివారం ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి గ్రామం నుంచి ఈతకోట రైసుమిల్లుకు ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌కు కొత్తపేట మండలం వాడపాలెం బండారుపేట సమీపంలో ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. కంగారుపడిన డ్రైవర్ ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసే క్రమంలో షడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకుపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవ డంతో పెను ప్రమాదం తప్పింది. చెల్లుబోయిన వెంకటరమణ, మట్టపర్తి వెంకట్రావులకు చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి.


