కిక్కిరిసిన రత్నగిరి | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన రత్నగిరి

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

అన్నవరం: సత్యదేవుని ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై సుమారు రెండువందల వివాహాలు జరిగాయి. నవదంపతులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వరుసగా రెండ్రోజులు సెలవు రావడంతో సమాన్య భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారి వ్రతాలాచరించారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు నిండిపోయాయి. 2,200 వ్రతాలు, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 50 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదానపథకంలో ఉచిత భోజన చేశారు.

ఘాట్‌రోడ్‌లో ట్రాఫిక్‌ జామ్‌

సత్యదేవుని సన్నిధిన శుక్రవారం రాత్రి భారీ సంఖ్యలో వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. వివాహాలకు వివిధ వాహనాలలో తరలివచ్చిన పెళ్లిబృందాలు శనివారం స్వామివారి వ్రతం దర్శనం అనంతరం దిగువకు ప్రయాణం అయ్యారు. స్వామివారి దర్శనానికి శనివారం వందల సంఖ్యలో వాహనాలలో వేలాదిగా విచ్చేసిన భక్తులు సైతం స్వామివారి దర్శనం అనంతరం దిగువకు ఒకేసారి ప్రయాణమవ్వడంతో శనివారం దేవస్థానం ఘాట్‌రోడ్‌లో భక్తుల వాహనాలతో సుమారు అరగంట సేపు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement