నేడు పది కోర్టుల భవన సముదాయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు పది కోర్టుల భవన సముదాయం ప్రారంభం

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

– ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌ రాక

రాజమహేంద్రవరం సిటీ, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన ‘‘పది కోర్టుల సముదాయ భవనం‘ ను శనివారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌ ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ , జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ బి.వి.ఎల్‌.ఎన్‌.చక్రవర్తి, జస్టిస్‌ సుమతి జగడం, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు. జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తూర్పు గోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తిగా కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌.వి. ప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పదికోర్టుల సముదాయ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లును పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement