సాక్షి, రాజమహేంద్రవరం: రోజురోజుకూ సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పులు తీవ్రంగా వీస్తున్నాయి. పొట్టకూటి కోసం ఎర్రటి ఎండలో సైతం శ్రమిస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలపై ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపడం లేదు. నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో టెంట్లు, తాగునీరు వంటి వసతులు కల్పించాలి. కానీ, ప్రభుత్వం ఆ అటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలు అల్లాడిపోతున్నారు.
కనీస సౌకర్యాలేవీ!
● పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు తాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 1న ఆదేశాలు జారీ చేసింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఎక్కడా తాగునీటి సదుపాయం కల్పించిన దాఖలాల్లేవు. దీంతో, కూలీలు ఇంటి నుంచి బాటిళ్లతో తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోంది.
● కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ప్రతి గంటకు నీరు తాగేలా వాటర్ బెల్ పద్ధతి అమలు చేయాలి. ఇది కూడా కాగితాలకే పరిమితమైంది.
● పని చేసి, అలసిసొలసిన కూలీలు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు, తాటాకు, ఈతాకు పందిళ్లు వేయాలి. ఎక్కడా ఆ పరిస్థితి లేకపోవడంతో కూలీలు ఎండలో ఆపసోపాలు పడుతున్నారు. మరి కొందరు చెట్ల నీడన సేద తీరుతున్నారు.
● పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలి. కానీ ఎక్కడా అటువంటి దాఖలాల్లేవు.
● ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకుని, తిరిగి 11 గంటలకు ఇళ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ పనులు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అయితే, ఉదయం 9 గంటల నుంచే వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. అయినప్పటికీ ఉపశమన చర్యలు ఉండటం లేదు.
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంతో పాటు కూలీలకు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సైతం అందజేసేవారు. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది.
అంతా అస్తవ్యస్తం
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. కూలీలకు సకాాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. సగటున రోజుకు రూ.300 వరకూ మాత్రమే కూలీ గిట్టుబాటు అవుతోంది. చాలీచాలని ఆ వేతనంతో కుటుంబాన్ని పోషించుకోలేక నిరుపేద శ్రామికులు నానా అవస్థలూ పడుతున్నారు. సాధారణంగా ఉపాధి కూలీలకు ప్రతి వారం వేతనాలు చెల్లించడం ఆనవాయితీ. కానీ, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వస్తున్న వేతనమే తక్కువ కాగా.. అది కూడా గత ఏడాది జూన్ నుంచి సక్రమంగా చెల్లించడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకపోవడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. రోజూ క్రమం తప్పకుండా పనులకు వెళుతున్నా.. తమ ఖాతాల్లో నయా పైసా జమ కావడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పని దినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ, వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు.
సాంకేతిక సమస్యలు
పనులు చేసిన కూలీలకు కొత్తగా ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. పని పూర్తయిన అనంతరం పని ప్రదేశంలోనే కూలీలకు ఐరిస్ తీసి, ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. అప్పుడే కూలీలు పనులకు హాజరైనట్లు పరిగణిస్తారు. ఈ నిబంధన కూలీలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఒకే ప్రాంతంలో వంద మంది కూలీలు పనులు చేస్తూంటే సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం, నెట్‌వర్క్ లేకపోవడం వంటి సమస్యలతో ఐరిస్ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఐరిస్ తీయడానికే సరిపోతోంది. కొందరికి ఐరిస్ నమోదు కాకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది.
వీబీజీ రామ్‌జీపై
గందరగోళం
మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీవీబీజీ రామ్‌జీశ్రీగా మార్చింది. నిబంధనల్లో సైతం మార్పులు చేసింది. కానీ, దీనిపై అధికారులకు నేటికీ మార్గదర్శకాలు అందలేదు. దీంతో, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు కల్పించాలన్న విషయమై అధికారుల్లో గందరగోళం నెలకొంది.

ఉపాధి కూలీలకు ఎండ దెబ్బ
పని ప్రదేశంలో వసతులు కరువు
కనిపించని తాగునీరు, టెంట్లు
మజ్జిగ పంపిణీకి
మంగళం పాడిన ప్రభుత్వం
జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు 21
పంచాయతీలు 343
మంజూరైన జాబ్‌కార్డులు 1,81,000
కూలీలు 2,76,000
యాక్టివ్ జాబ్‌కార్డులు 1,36,000
పనులు వినియోగించుకుంటున్న కూలీలు 1,91,000
ప్రతి రోజూ వస్తున్న కూలీలు 30,000