కాకినాడలో చైన్నె షాపింగ్‌ మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కాకినాడలో చైన్నె షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కాకినాడ మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ది చైన్నె షాపింగ్‌ మాల్‌ను శనివారం సినీ నటి మృణాల్‌ ఠాకూర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టు, ఫ్యాన్సీ, రెడీమేడ్‌ వస్త్రాలు అనేక రకాల డిజైన్లలో ఇక్కడ లభిస్తాయన్నారు. నాణ్యతకు నమ్మకానికి మారు పేరుగా చైన్నె షాపింగ్‌ మాల్‌ ఖ్యాతి పొందిందన్నారు. షాపింగ్‌మాల్‌ నిర్వాహకులు ఎం.వెంకటరెడ్డి, కృష్ణారావు మాట్లాడుతూ తమ షోరూమ్‌లో మహిళలు, పురుషులు, చిన్నారులకు అవసరమైన ఎన్నో రకాల డిజైన్ల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు చెప్పారు. షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించేందుకు వచ్చిన మృణాల్‌ ఠాకూర్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో నగర ప్రజలు రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. కార్యక్రమంలోఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement