రాష్ట్ర పన్ను ఉపసంహరించాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పన్ను ఉపసంహరించాలి

May 16 2026 12:27 AM | Updated on May 16 2026 12:27 AM

రాష్ట్రంలో పెట్రో ధరల పెంపు సాధారణ ప్రజలపై తీవ్ర భారం మోపుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో, పెట్రోలు ధరల పెంపు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడుతో పోలిస్తే ఏపీలో పెట్రోలు ధరలు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ప్రభుత్వం వెంటనే పెట్రోలుపై రాష్ట్ర పన్నులను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలి.

– తాడేపల్లి విజయ్‌కుమార్‌, న్యాయవాది

రాష్ట్రంలో ధరల నియంత్రణ ఏదీ?

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెరుగుదలకు సాకులు చెబుతూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ధరల నియంత్రణ చర్యలు, రాయితీలు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రజల కష్టాలపై రాజకీయాలు చేయడం మానుకుని, వెంటనే ధరలను నియంత్రించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలి.

– ఎస్‌.కిరణ్‌ కుమార్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement