నా పేరు జి.నికిలేష్. పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నాను. ఐదేళ్లుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పటి వరకూ నాలుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో పతకం సాధించడమే లక్ష్యంగా సాగుతున్నాను.
ఫిట్‌నెస్ కోసం ఆడుతున్నా..
నా పేరు షేక్ సాజిద్ అలోక్. తొమ్మిదో తరగతి చదువుతున్నాను. రోజుకు రెండు గంటలు టెన్నిస్ సాధన చేస్తున్నాను. ఫిట్‌నెస్ కోసం ఈ క్రీడ ఆడుతున్నాను. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం.
మూడేళ్లుగా శిక్షణ
నాపేరు కె.కుందన. ఇంటర్ చదువుతున్నాను. నాకు టెన్నిస్ క్రీడాకారుడు ఫెదరర్ అంటే ఇష్టం. గత మూడు సంవత్సరాలుగా కోచ్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నాను. రోజుకు 2 గంటలు ఆడుతున్నాను.


