రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

రంగంపేట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్టు ఎస్సై శివప్రసాద్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కాకినాడ ప్రతాప్‌ నగర్‌కు చెందిన మారోజు భాస్కర్‌ (24) శుక్రవారం అర్ధరాత్రి వడిశలేరు నుంచి తన మోటార్‌ సైకిల్‌పై కాకినాడ వెళ్తున్నాడు. రంగంపేట సమీపాన చాగల్నాడు కాలువ వద్దకు వచ్చేసరికి మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి అతడు కాలువలో పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సూరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

యువకుడిపై పోక్సో కేసు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): స్థానిక సిమెంటరీ పేటకు చెందిన 14 ఏళ్ల బాలికను ఏడిపిస్తున్న గొట్టేటి రాకేష్‌పై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం పోక్సో కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ ఎస్సై ప్రతాప్‌ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐసెట్‌లో వైష్ణవి స్టేట్‌ ఫస్ట్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐసెట్‌లో కాకినాడ విద్యార్థిని పట్నాల వైష్ణవి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. ఆమె విద్యాంజలి పాఠశాలలో పదో తరగతి (సీబీఎస్‌ఈ), ఆదిత్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ (ఎంఈసీ), సంజీవ్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చదివింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడం తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పింది. సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలు లేదా ఉత్పత్తులు అందించాలని భావిస్తున్నట్టు చెప్పింది. ఆమె తండ్రి మోహనరావు కన్‌స్ట్రక్షన్‌ ఆఫీసులో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. తల్లి సత్యవతి గృహిణి.

వైఎస్సార్‌ సీపీలో

పలు నియామకాలు

సాక్షి, అమలాపురం: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీలలో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్‌ వింగ్‌ కమ్యూనిటీస్‌లో రాష్ట్ర బీసీ సెల్‌ జనరల్‌ సెక్రటరీలుగా మేడిశెట్టి దుర్గారావు(మండపేట), కుడుపూడి రాంబాబు(మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్‌ జనరల్‌ సెక్రటరీగా వల్లూరి రామకృష్ణ (మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్‌ జాయింట్‌ సెక్రటరీగా మాత మురళి (రామచంద్రపురం), రాష్ట్ర యూత్‌ వింగ్‌ సెక్రటరీగా సలాది సత్యనారాయణమూర్తి (అమలాపురం)లను నియమించారు. ఆర్‌టీఐ వింగ్‌జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొల్లు త్రినాథవర్మ (అమలాపురం), మండల పార్టీ కమిటీ కాట్రేనికోన మండల జనరల్‌ సెక్రటరీగా మల్లాడి వీరబాబ్జి (ముమ్మిడివరం) నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement