బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశం ఎందుకని కోనసీమ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. జెడ్పీ సమావేశాలకు కలెక్టర్, జేసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రతీ సమావేశానికి కలెక్టర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్ లేకుంటే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశానికి హాజరుకాని కలెక్టర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ రానప్పుడు దూర ప్రాంతాల నుంచి తాము వచ్చినా ఏమీ ఉపయోగమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమలో జాతీయ రహదాలకు పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్‌కు సంబంధించిన విషయాలు సమావేశంలో చర్చించాలని దీనిపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ కనీసం జాయింట్ కలెక్టర్ అయినా లేకుంటే ఎలా అన్నారు. జెడ్పీ సమావేశానికి డీఆర్‌ఓ స్థాయి అధికారులను పంపిస్తున్నారని, ఇలా అయితే సమావేశం వద్దని ఆయన జెడ్పీ చైర్మన్‌కు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశం వేరొక రోజు పెట్టాలని ఆ రోజు కలెక్టర్ వచ్చేలా చూడాలని ఎమ్మెల్సీతో పాటు జేడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సభ్యులకు ఎంత సర్దిచెప్పినా వారు తగ్గలేదు. కలెక్టర్‌తో సంప్రదించిన తర్వాతనే తాము సమావేశానికి తేదీలు ఖరారు చేశామని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. కోనసీమ జిల్లాకు జడ్జి రావడంతో ప్రొటోకాల్ నిమిత్తం కలెక్టర్ ఉండాల్సి వచ్చిందని చెప్పడంతో వారు శాంతించారు.
సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన మంచినీరివ్వాలి : ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఆర్వో ప్లాంట్‌ల నిర్వహణను ఆయా కంపెనీలు సక్రమంగా చేయడం లేదని, అధికారులు పర్యవేక్షించడం లేదని మండిపడ్డారు.
వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, దీంతో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అక్కడి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మండిపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని చెప్పారు. రహదారులు సక్రమంగా లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని పలువురు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా రౌతులపూడి, తేటగుంట, ఎస్ పైడిపాల రోడ్డు పూర్తిగా గోతుల మయం అయిందన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
MýSÌñæ-MýStÆŠ‡ çÜÐ]l*-Ðól-Ô>-°MìS Æ>¯]l…-§ýl$MýS$ °Æý‡çÜ-¯]lV> ¯ólÌSOò³ MýS*Æý‡$a¯]l² ˘
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కోనసీమ జిల్లా జెడ్పీటీసీ సభ్యులు
సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు
కోనసీమ జెడ్పీటీసీ సభ్యుల ఆందోళన
రైతులకు మద్దతు ధర
కల్పించడంలో ప్రభుత్వం విఫలం
వాడీవేడిగా ఉమ్మడి తూర్పుగోదావరి
జిల్లా పరిషత్ సమావేశం
వరి రైతులు నష్టపోతున్నారు : ఎంపీ బోస్
ప్రస్తుత రబీలో వరి రైతులకు మద్దతు ధర రాాకపోవడం వల్ల ప్రతి బస్తాకు రూ.200 నుంచి రూ.300 నష్టపోవాల్సి వస్తోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోనసీమ జిల్లాలో తక్కువ రైస్‌మిల్లులు ఉండడం వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఇతర రైస్ మిల్లులకు కోనసీమ ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని, అప్పుడు రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. దీనికి కాకినాడ జిల్లా కలెకర్ట్ సానుకూలంగా స్పందించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు.


