● 36 రోజుల పాటు వివాహాలకు విరామం
● జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు
ద్వారకాతిరుమల: వివాహాది శుభ మూహూర్తాలకు 36 రోజులపాటు బ్రేక్ పడనుంది. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) కావడంతో ఈ నెలలో ఆఖరి ముహూర్తం 13న పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. మళ్లీ జూన్ 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ మౌఢ్యమి వల్ల వివాహ సంబంధ వృత్తులపై ఆధారపడిన వారికి పనులు లేనట్టే. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే..
శుభకార్యాలు పనికిరావు
అధిక జ్యేష్ఠమాసం వల్ల వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు తదితర శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే.
– గోవిందవఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు,
ద్వారకాతిరుమల


