హాకీ వేసవి శిక్షణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

హాకీ వేసవి శిక్షణ ప్రారంభం

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

స్థానిక పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాకీ వేసవి క్రీడాశిక్షణ శిబిరం గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి హాకీ సంఘ ప్రతినిధి వి.రవిరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్‌డీఓ సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. రవిరాజు మాట్లాడుతూ క్రీడాయాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు మాత్రమే ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈనెల 30 వరకు జరిగే ఈ శిబిరంలో 40 మంది పాల్గొంటున్నారని, ఫిట్‌నెస్‌ మెళకువలతోతో పాటు హాకీలో ఓనమాలు నేర్పిస్తామని చెప్పారు. ఖో–ఖో సంఘ అధ్యక్షుడు పట్టాభి మాట్లాడుతూ క్రీడల్లో రాణించేవారికి ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తుందన్నారు. పీఆర్‌ కళాశాల పీడీ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని తెలిపారు. పీఆర్‌జీ పీడీ రమణ, గ్రౌండ్స్‌మెన్‌ శ్రీను పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement