● ఉత్సాహంగా వేసవి శిబిరాలు
● పలు అంశాల్లో విద్యార్థులకు శిక్షణ
● ఏపీఎస్పీ బెటాలియన్ స్కూల్లో క్యాంప్
విద్యార్థులకు విద్య, విజ్ఞానం అందించడంతో పాటు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేలా వేసవి శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో గత నెల 24న ప్రారంభమైన శిబిరంలో పలు పాఠశాలల విద్యార్థులు, బెటాలియన్ సిబ్బంది, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిషు, స్టోరీ టెల్లింగ్, వేదిక్ మ్యాథ్స్, అబాకస్, రీజనింగ్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, గ్లాస్ పెయింటింగ్, భగవద్గీత శ్లోకాల పఠనం, నో ఫైర్ కుకింగ్, యోగా, రైఫిల్ షూటింగ్, వాలీబాల్ వంటి వాటిలో శిక్షణ పొందుతున్నారు.
– కాకినాడ రూరల్


