ప్రతిపాదనపై స్పందన కరువు
కేజీ బంగారం ధర 2024లో రూ.60 లక్షలు. ఆ ప్రకారం 11.50 కేజీల బంగారానికి రూ.7 కోట్లు, రాగి కవచాల తయారీ, ఇతర వ్యయం రూ.కోటి అవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు దాతల విరాళాలు రూ.8 కోట్లతో సత్యదేవుని ఆలయ శిఖరం స్వర్ణ తాపడం చేసేందుకు అప్పటి దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్ (ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్) ప్రతిపాదనలు పంపించారు. దీని కోసం భక్తులు రూ.వెయ్యి నుంచి ఎంత మొత్తం విరాళం ఇచ్చినా స్వీకరించేలా ఒక స్కీమ్ రూపొందించారు. అయితే, ఆయన 2024 నవంబర్‌లో విజయవాడలోని కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయిన తరువాత ఈ ప్రతిపాదనపై ఎటువంటి కదలికా లేదు.
అన్నవరం: సత్యదేవుని ఆలయ శిఖరాన్ని స్వర్ణమయం చేయడం కలగానే మిగిలిపోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకవైపు భారీగా పెరిగిన బంగారం ధర, మరోవైపు దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, దాతలు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ఈ బృహత్తర కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడుతున్న పరిస్థితి నెలకొంది. సత్యదేవుని పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో అదేచోట నూతన ఆలయాన్ని పునర్నిర్మించి 2012 మార్చి 14న ప్రారంభించారు. ఆలయాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించి, బంగారు రేకు తాపడం చేయడానికి వీలుగా ఆలయ శిఖరాన్ని మాత్రం ఇటుకతో నిర్మించారు.
2024లోనే..
స్వర్ణ శిఖరం ఏర్పాటును దాతల సహకారంతో పూర్తి చేయాలని దేవస్థానం అధికారులు 2024లో భావించారు. ఈ మేరకు ఎండోమెంట్స్ ప్రధాన స్థపతి పరమేశ్వరప్ప సత్యదేవుని ఆలయ శిఖరం కొలతలు తీసుకున్నారు. సుమారు 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు కలిగిన ఈ ఆలయ శిఖరంపై 50కి పైగా దేవతా శిల్పాలున్నాయి. వీటన్నింటి కొలతలు తీసి, తొలుత రాగి రేకుతో వీటికి కవచాలు తయారు చేయించి, ఆపై బంగారు పూత పూయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి 11.50 కేజీల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ తరువాత టీటీడీ నిపుణులు కూడా ఆలయాన్ని పరిశీలించి, శిఖరం స్వర్ణ మయం చేయడానికి సుమారు 20 కిలోల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. కానీ, దేవస్థానం ఆ ప్రతిపాదనలను తిరస్కరించి, 11.50 కేజీల బంగారంతో చేయించేందుకే మొగ్గు చూపింది.
నేడు ధరాభారం
కొన్నాళ్లుగా బంగారం రేటుకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కేజీ బంగారం ధర సుమారు రూ.1.50 కోట్లు ఉంది. ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో ఆలయ శిఖరం స్వర్ణమయం చేయడానికి అవసరమైన బంగారానికే దాదాపు రూ.18 కోట్లు అవుతుందని, రాగి కవచాలు, ఇతర ఖర్చులు మరో రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.20 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ వ్యయాన్ని భరించే పరిస్థితిలో దేవస్థానం లేదు. అలాగని ఇంత పెద్ద మొత్తం విరాళంగా సమర్పించేందుకు దాతలు కూడా ముందుకు రాని పరిస్థితి. దేవస్థానం గత ఫిబ్రవరిలో 9.5 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్ల స్కీములో డిపాజిట్ చేశారు. అలాగే, 2018లో దేవస్థానం వద్ద ఉన్న వెండిని కరిగించి, దానిని విక్రయించగా వచ్చిన డబ్బుతో 7 కిలోల బంగారం కొనుగోలు చేశారు. దానిని కూడా స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. ఈ బంగారంతో స్వర్ణ శిఖరం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రతిపాదనలు ముందుకు కదిలే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో 2024లో సత్యదేవునికి సుమారు రూ.2 కోట్లతో నూతన ధ్వజస్తంభం, దానికి బంగారు రేకు తాపడం చేశారు. కానీ, స్వర్ణ శిఖరం మాత్రం నేటికీ కలగానే మిగిలిపోయింది. దేవదాయ శాఖ ఉన్నతాధికారులు బడా పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించి, ఈ కార్యక్రమం పూర్తి చేస్తేనే తిరుమల, శ్రీశైలం, విజయవాడ వంటి ఆలయాల మాదిరిగా సత్యదేవుని ఆలయ శిఖరానికి కూడా స్వర్ణ శోభతో ప్రకాశించే అవకాశం కలుగుతుతుంది.
సత్యదేవుని ఆలయ శిఖరం
·˘ çÜ™èlŧólÐ]l#° BÌSĶæ$ çÜÓÆý‡~ ÕQÆ>°MìS
గతంలో ప్రయత్నాలు
·˘ 11.50 MóSiÌS º…V>Æý‡…
అవసరమన్న నిపుణులు
·˘ Æý‡*.8 MørÏÐ]l#™èl$…§ýl° Aç³µsZÏ A…^èl¯é
·˘ {ç³çÜ$¢™èl… Æý‡*.20 Mør$Ï Oò³V>
ఖర్చయ్యే అవకాశం
·˘ Cç³µsìæMîS M>¯]lÆ>° ç³#ÆøVýS†
·˘ {糿¶æ$™èlÓ… gZMýSÅ…
చేసుకోవాలంటున్న భక్తులు


