● జలకాలాటల్లో ఆగేదెలేదు! | - | Sakshi
Sakshi News home page

● జలకాలాటల్లో ఆగేదెలేదు!

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

మూగజీవాలకు వేసవి తాపం నుంచి ఉపశమనం ఇది. ఎండలు మండుతున్న వేళ ఇలా జలకాలాడుతూ సేదతీరాయి. పలు గ్రామాలకు చెందిన వారు తమ పశువులను కోరంగి అటవీ ప్రాంతంలో ఏడాదంతా మేపుతుంటారు. వేసవిలో కాలువలకు నీరు నిలిపివేయడంతో పాటు అడవిలో పచ్చిక లేక గ్రామాల్లోకి తోలుకు వస్తుంటారు. ఇలా ఏటా వందలాది గేదెలు తాళ్లరేవు మండలంలో దర్శనమిస్తుంటాయి. పోలేకుర్రు ఇరిగేషన్‌ కాలువలో ఉన్న కొద్దిపాటి నీటిలో అనేక గేదెలు ఇలా వేసవి తాపాన్ని తీర్చుకున్నాయి.

–తాళ్లరేవు

Advertisement
 
Advertisement
Advertisement