సామర్లకోట: సెలవులు కావడంతో పిల్లలంతా క్రికెట్ ఆడుతుండగా బంతి ట్రాన్‌ఫార్మర్‌లోకి వెళ్లింది.. దానిని తీసే క్రమంలో ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురికావడంతో, శరీమంతా కాలిపోయింది. స్థానికులు కథనం ప్రకారం.. సామర్లకోట గాంధీనగర్‌కు చెందిన కరణం పవన్ (13) సదాశివ నగర్‌లోని ఖాళీ స్థలంలో క్రికిట్ ఆడుతున్నాడు. ఈ సమయంలో బంతి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లోకి వెళ్లిపోయింది. వెంటనే ఆ బాలుడు బంతిని తీయడానికి ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. శరీరం అంతా పూర్తిగా కాలిపోవడంతో అతనిని కాకినాడలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉందని, సుమారు రూ.10 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పేద కుటుంబం కావడంతో ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ యువకుడిని ఆదుకోవాలని స్నేహితులు కోరుతున్నారు.
● తీస్తుండగా బాలుడికి షాక్
● శరీరమంతా తీవ్ర గాయాలు


