గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో ప్రతిభ

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

సీతానగరం: కీ బోర్డుపై సుస్వరాలు పలికించి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులో రాపాక శ్రేష్ట జోయిస్‌ ప్రతిభ చాటింది. సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన జోయిస్‌ అక్కడి ప్రైవేట్‌ స్కూల్‌లో యూకేజీ చదువుతుంది. ఆ పాప పుట్టినప్పుడు, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తండ్రి వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ తల్లి సోనీ ప్రశాంతి, మేనమామ గుర కిషోర్‌కుమార్‌, అమ్మమ్మ అందించిన సహకారంతో ప్రతిభ చాటింది. ఫిబ్రవరి 2న గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సామూహిక కీ బోర్డు ప్లే జరిగింది. సుమారు 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డు వాయిద్యకారులు పాల్గొనగా, 777 మంది ప్రతిభ కనబరిచారు. ఇందులో రాపాక శ్రేష్ట జోయిస్‌తో పాటు తల్లి సోనీ ప్రశాంతి, మేనమామ కిషోర్‌ కుమార్‌ కూడా ఉన్నారు. వీరికి ఈ నెల 9న విజయవాడలో హల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్‌ వ్యవస్థాపకులు అగస్టీన్‌ దండింగి సర్టిఫికెట్లు, పథకాలను అందజేశారు.

విజయవాడలో సర్టిఫికెట్‌ అందుకున్న శ్రేష్ట జోయిస్‌తో పాటు తల్లి, మేనమామ

Advertisement
 
Advertisement
Advertisement