హోరాహోరీగా పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

అమలాపురం రూరల్‌: అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో 15వ నేషనల్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ క్లాసిక్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు రెండో రోజు హోరాహోరీగా కొనసాగాయి. ఇందులో దేశంలోని 22 రాష్ట్రాల నుంచి 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రెండో రోజు వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌లో వివిధ కేటగిరీల్లో పోటీలు జరిగాయి. నేషనల్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో విజేతల వివరాలను ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. 53 కిలోల బాలుర విభాగం (సబ్‌ జూనియర్స్‌)లో చందనకుమార్‌ ప్రజాపతి (జార్ఖాండ్‌), దేవరాజ్సెన్‌ (రాజస్థాన్‌), 53 కిలోల బాలుర జూనియర్‌ విభాగంలో సుభమ్‌రానా (హర్యానా), ఉదయకుమార్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), నీరల్‌పావాల్‌ (మహారాష్ట్ర), సహిల్పార్వాల్‌ (మహారాష్ట్ర), 43 కిలోల విభాగం బాలికలు సబ్‌ జూనియర్‌లో సినచానా కేహెచ్‌ (కర్ణాటక), పటేల్భూమి హేమంతరాయ్‌ (గుజరాత్‌), దీపికాపీవీ (కేరళ), 47 కిలోల విభాగం బాలికలు (సబ్‌ జూనియర్‌) అక్షడభగవత్‌ (మధ్యప్రదేశ్‌), అకిల కేఆర్‌ (కేరళ), ఆభాచంద్రకర్‌ (ఛత్తీస్‌గఢ్‌), 43 కిలోల విభాగం బాలికలు (జూనియర్‌) రుప్సికుమారి (ఢిల్లీ), సిసీరా.ఎస్‌ (కేరళ), పుష్పవిశ్వకర్మ (గోవా), 47 కిలోల విభాగం బాలికలు (జూనియర్‌) అంజన కృష్ణవీకే (కేరళ), కియాకునాలె బెనర్జీ (హర్యానా), అదితి హోదన్దేకర్‌ (మహారాష్ట్ర) విజేతలుగా నిలిచారు. విజేతలకు అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, మెట్ల రమణబాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యాళ్ల దొరబాబు, బోనం సత్తిబాబు, రవణం వేణుగోపాలరావు, గారపాటి చంద్రశేఖర్‌, అశెట్టి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement