15 నుంచి జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

15 నుంచి జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

అమలాపురం టౌన్‌: స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 15వ జాతీయ సబ్‌ జూనియర్‌ అండ్‌ జూనియర్‌ క్లాసిక్‌ (మెన్‌ అండ్‌ వుమెన్‌) పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్పోర్ట్స్‌ క్లబ్‌ అసోసియేషన్‌, జిల్లా హెల్త్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ల ప్రతినిధులు తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పోటీల బ్రోచర్లను ఎంపీ గంటి హరీష్‌ మాధుర్‌ మంగళవారం విడుదల చేశారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇండియన్‌ టీమ్‌ సెలక్షన్‌ ట్రయిల్స్‌ ఫర్‌ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ను, ఏషియాడ్‌ టీమ్‌ సెలక్షన్స్‌ ట్రయల్స్‌ను ఆంధ్ర ప్రదేశ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలకు 29 రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారుల ఎంట్రీలు ఇప్పటికే వచ్చాయని పేర్కొన్నారు. మెన్‌ అండ్‌ వుమెన్‌ విభాగాల్లో 36 కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు ముత్తాబత్తుల వెంకటరమణ, ఆశెట్టి ఆదిబాబు, నార్ని శ్రీను, పెద్దిరెడ్డి రాము, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement