పెదపూడి : ఉభయగోదావరి జిల్లాల్లో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేసి, అన్నదాన సత్రాలు నిర్మించిన అపర దాన కర్ణుడు కీర్తి శేషులు కొవ్వూరి బసివిరెడ్డి అని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. జి.మామిడాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కొవ్వూరి బసివిరెడ్డి కాంస్య విగ్రహానికి సోమవారం మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఖండాంతరాల ఖ్యాతిగడించిన బసివిరెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఆవిశ్రాంతంగా కృషి చేసిన ప్రముఖ యువనేత చింతా దొరబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మండా రాజారెడ్డి, మండల కన్వీనర్ గుత్తుల రమణ, పార్టీ గ్రామ కన్వీనర్,కోకన్వీనర్ మేడపాటి తాతారెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసారెడ్డి, పార్టీ నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి(చింతపండు), కర్రి వీర్రెడ్డి, కోసూరి వాసు, లంక రమేష్, గుడిమెట్ల మురళీ, సబ్బెళ్ల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు
47 ఫిర్యాదులు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. దీనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్జీదారులు వచ్చి ఎస్పీ డి.నరసింహాకిశోర్‌కు ఫిర్యాదులు అందజేశారు. మొత్తం పీజీఆర్‌ఎస్‌కు 47 ఫిర్యాదులు అందగా, వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయి. వాటిని సంబంధిత స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.
కడియం రైల్వే గేటు మూసివేత
కడియం: సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కడియం ఫిష్‌ఫామ్ వద్దగల రైల్వే గేటును మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.


