పీఈటీ అవ్వాలని... | - | Sakshi
Sakshi News home page

పీఈటీ అవ్వాలని...

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

నా పేరు కర్రి దుర్గాప్రసాద్‌. పీఆర్‌ బాలుర పాఠశాలలో నేను 10 వ తరగతి చదువుతున్నాను. పీఈటీ అవ్వాలనేది నా కోరిక. స్పోర్ట్స్‌ కోటాలో పీఈటీ ఉద్యోగం సాధించాలని హాకీలో చేరాను.

క్రీడలంటే ఇష్టం

నా పేరు లలిత ప్రియ. నేను శ్రీనగర్‌ మున్సిపల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను. నాకు క్రీడలంటే చిన్నతనం నుంచీ ఇష్టం. అందుకే హాకీ శిబిరంలో చేరాను.

టీచర్‌ ఉద్యోగం నా లక్ష్యం

నా పేరు జి.అఖిల. నేను నీఆర్‌ బాలికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నేను మొదటిసారి వేసవి శిక్షణకు హాజరయ్యాను. టీచర్‌ అవ్వాలనేది నా లక్ష్యం.

జాతీయ స్థాయిలో రాణించడమే ధ్యేయం

నా పేరు సీహెచ్‌బీఎల్‌ఎస్‌ షణ్ముకేశ్వరి. నేను పీఆర్‌ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పీడీ షేక్‌ మస్తాన్‌ బేగంను స్ఫూరిగా తీసుకుని హాకీ వైపు వచ్చాను. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా రాణించడం నా ధ్యేయం.

Advertisement
 
Advertisement
Advertisement