సురక్షితంగా ఇంటికి చేర్చిన
కేఎస్‌ఎం అధికారులు
అమలాపురం రూరల్: ఉపాధి కోసం వెళ్లి మస్కట్‌లో నరకయాతన అనుభవించిన జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పకు చెందిన కె.లక్ష్మిని కేసీఎం అధికారులు సురక్షితంగా ఇంటికి చేర్చారు. గత ఏడాది సెప్టెంబర్ 8న ఏజెంట్ అక్కడకు వెళ్లిన మహిళ ఓ ఇంటిలో పనికి చేరింది. యజమాని వేధింపులు భరించలేక తన భర్త శ్రీనివాసరావుకు ఆ సమాచారాన్ని ఇచ్చింది. కలెక్టరేట్‌లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేఎస్‌ఎం)ను సంప్రదించగా కలెక్టర్ ఆదేశాలతో అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టి ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చారు.


