హక్కుల సాధన కోసమే పోరాటం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధన కోసమే పోరాటం

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

అఖిల భారత వ్యవసాయ కార్మిక

సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌

అమలాపురంలో మొదలైన మహాసభలు

ఎర్ర జెండాలతో హోరెత్తిన మహా ప్రదర్శన

అమలాపురం టౌన్‌: వ్యవసాయ కార్మికుల్లో ఐక్యత కోసం, కార్మిక హక్కుల సాధన కోసం జాతీయ, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో 30వ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం ఏర్పాట్లు చేసింది. పుర వీధుల్లో సంఘం మహా ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనలో వ్యవసాయ కార్మిక ప్రతినిధులు 30వ కవాతు నిర్వహించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్‌, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, చైతన్య, రాష్ట్ర కార్యదర్శులు కె.లోకనాధం, వి.వెంకటేశ్వర్లు ప్రసంగించి వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలకు పలు రాష్ట్రాల నుంచి వ్యవసాయ కార్మిక ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. చివరిగా సభా వేదికపై వారంతా సంఘీభావం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement