మండుటెండలోనూ తగ్గని భక్తజన సందడి | - | Sakshi
Sakshi News home page

మండుటెండలోనూ తగ్గని భక్తజన సందడి

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

అన్నవరం: ఎండలు మండిపోతున్నా రత్నగిరిపై భక్తుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. సూర్యుడు 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో చెలరేగుతున్నా.. భక్తులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. అచంచల భక్తిభావంతో సత్యదేవుని దర్శనానికి వారం రోజులుగా వేలాదిగా తరలివస్తూనే ఉన్నారు. వారం రోజులుగా వివాహలు జోరుగా జరుగుతూండటంతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. సుమారు 40 వేల మంది భక్తులు గురువారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. వ్రతాలాచరించేందుకు సైతం భక్తులు బారులు తీరారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల నుంచి దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement