రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

దేవరపల్లి: మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తి బలంగా ఢీకొనడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. గోపాలపురం మండలం కరిచర్లగూడెంలోని మాతంగమ్మ గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరిచర్లగూడేనికి చెందిన కొమ్మిరెడ్డి నాగేశ్వరరావు (45) శుక్రవారం రాత్రి ఎన్‌హెచ్‌ 516 డి జాతీయ రహదారిపై నడిచి వెళుతున్నాడు. కొయ్యలగూడెం వైపు నుంచి గోపాలపురం వైపు మోటార్‌ సైకిల్‌పై వస్తున్న వ్యక్తి అతడిని బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి. సుబ్రహ్మణ్యంతెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి..

రాజమహేంద్రవరం సిటీ: కడియం రైల్వే స్టేషన్‌ సమీపంలో సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శనివారం రైలు ఢీకొని మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ గంగరాజు తెలిపారు. అతడు ఐదు అడుగులు ఎత్తు కలిగి ఉండి, సిమెంటు రంగు నిక్కరు, ఎరుపు రంగు హాఫ్‌ హాండ్స్‌ షర్ట్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్‌లో 944077 9249, 0883 2442821 నంబర్లకు తెలియజేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement