జోరుగా.. హుషారుగా.. | - | Sakshi
Sakshi News home page

జోరుగా.. హుషారుగా..

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

నా పేరు ఎస్‌.చార్విన్‌.

ఐదో తరగతి చదువుతున్నాను. నాకు ఫెదరర్‌ అంటే ఇష్టం. టెన్నిస్‌లో రాణించి కార్డియాలజిస్టు కావాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్‌లో చేరాను. ఈ క్రీడలో రాణించేందుకు కృషి చేస్తున్నాను.

ఉత్సాహంగా లాన్‌ టెన్నిస్‌ శిక్షణ

వేసవి వేళ సద్వినియోగం

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కలలను నిజం చేసుకునే అడుగది.. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే సమయమిది.. చిన్నతనం నుంచే అనుకున్న లక్ష్యం దిశగా కొందరు బాటలు వేసుకుంటుండగా, మరికొందరు ఖాళీ సమయాన్ని ఇష్టమైన క్రీడకు కేటాయిస్తున్నారు. అలాంటి వారి కోసం కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో జిల్లా లాన్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో శాప్‌ సహకారంతో లాన్‌టెన్నిస్‌ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ రోజూ ఉదయం 6 నుంచి 8 వరకూ, సాయంత్రం 4 నుంచి 7 వరకూ శిక్షణ అందిస్తున్నారు. ఐదేళ్ల వయసు నుంచి చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. చీఫ్‌ కోచ్‌ పీవీ రామ్‌కుమార్‌తో పాటు రమణ, త్రినాథ్‌, అనంత్‌, నాని శిక్షణ అందిస్తున్నారు. ఫిట్‌నెస్‌తో పాటు, టెన్నిస్‌లో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. 120 మంది క్రీడాకారులు ఈ వేసవి శిక్షణకు హాజరై ఓనమాలు నేర్చుకుంటున్నారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు టెన్నిస్‌ సంఘం తరఫున ప్రతి రోజూ గుడ్డు, నిమ్మ రసం అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన శ్రీవేద పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 587 మార్కులు సాధించి విద్యలోనూ సత్తా చాటింది. అలాగే విద్యార్థిని ప్రవల్లికి స్పోర్ట్స్‌ కోటాలో ఇంజినీరింగ్‌ సీటు వచ్చింది. స్థానిక డీఎస్‌ఏ మైదానంలోని టెన్నిస్‌ కోర్టుల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు తమ మనోభావాలు ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.

నాన్న ఆడడం చూసి..

నా పేరు జాహ్నవిక.

మా నాన్న ఆర్‌ఎంసీ మైదానంలో టెన్నిస్‌ ఆడేవారు. అక్కడ టెన్నిస్‌ ఆడడం చూసి టెన్నిస్‌పై ఇష్టం పెంచుకున్నాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించాలని ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement