యానాం: స్థానిక గౌతమీ గోదావరిలో స్నేహితులతో స్నానానికి దిగి గల్లంతైన రాజమహేంద్రవరం మంగళవారపుపేటకు చెందిన అబ్దుల్ ఫైజాన్ (18) మృతదేహం లభ్యమైంది. సోమవారం అర్ధరాత్రి అగ్నిమాపకదళ సిబ్బంది, మత్స్యకారులు అతడి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై కుమరన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుష్కరఘాట్ వద్ద నిర్మించిన బారికేడ్ల వద్ద మెష్ నిర్మించకపోవడం వల్ల ఆ గొట్టాల మధ్య నుంచి గోదావరిలో జారిపోయాడని స్థానికులు అంటున్నారు.


