లూపస్ వ్యాధిపై అపోహలు తొలగించుకుని, అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం, కానీ అదుపు చేయవచ్చు. ఇందుకోసం దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణ వ్యాయామం చేయడం, ఎండలో తిరగకుండా ఉండడం, సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడటం, సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండడం చేయాలి. లూపస్ వ్యాధి ఉన్న గర్భిణులు ఎక్కువ సార్లు వైద్యుల వద్ద చెకప్ చేయించుకుంటూ మందులు వాడితే వారి ప్రసవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– డాక్టర్ వసుంధర, జిల్లా వైద్య,
ఆరోగ్యశాఖ అధికారి, రాజమహేంద్రవరం


