వేసవి శిక్షణ.. జ్ఞాన సముపార్జన | - | Sakshi
Sakshi News home page

వేసవి శిక్షణ.. జ్ఞాన సముపార్జన

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

వివిధ అంశాలపై అవగాహన

ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటున్న వైనం

తుని రూరల్‌: వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ అంశాలపై శిక్షణ పొందుతూ విజ్ఞానం పెంచుకుంటున్నారు. దీనిలో భాగంగా మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌లో టైపింగ్‌, పరికరాలు (టూల్స్‌), పెయింటింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. డి.పోలవరం, కొలిమేరు, ఎన్‌.సూరవరం, ఎస్‌.అన్నవరం, తేటగుంట పాఠశాలల్లో ఆరు నుంచి పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు వీటిని నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకూ జరిగే ఈ శిక్షణను ఒక్కొక్క పాఠశాలలో 15 నుంచి 20 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నారు. ఆరో తరగతి నుంచి కంప్యూటర్‌ పరిజ్ఞానంపై అవగాహన ఉంటే ఇంటర్మీడియట్‌, డిగ్రీ తర్వాత చదువుల్లో మరింత వేగవంతంగా కంప్యూటర్‌ కోర్సుల్లో విద్యార్థులు పట్టు సాధిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

డి.పోలవరం హైస్కూల్లో పెయింటింగ్‌ నేర్చుకుంటున్న విద్యార్థులు

కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు

Advertisement
 
Advertisement
Advertisement