● జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు
● ధవళేశ్వరంలో ఘనంగా
సర్ ఆర్థర్ కాటన్ జయంతి
ధవళేశ్వరం: ఆనకట్ట నిర్మాణం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన సర్‌ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. సర్‌ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీ సెంటర్‌లో ఉన్న కాటన్ విగ్రహానికి వేణుగోపాలరావు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బ్యారేజీ సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆనకట్ట నిర్మాణం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన కాటన్ డెల్టా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.


