దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి అనంత రెండోస్థానంలో ఉంది. ఇలాంటి ప్రాంతంలో తాగు, సాగునీటి కష్టాలూ అధికమే. అందుకే ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి. భూగర్భజలమట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలి. కానీ కొందరు ఇసుక కోసం నదులను చెరబడుతూ కొద | - | Sakshi
Sakshi News home page

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి అనంత రెండోస్థానంలో ఉంది. ఇలాంటి ప్రాంతంలో తాగు, సాగునీటి కష్టాలూ అధికమే. అందుకే ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి. భూగర్భజలమట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలి. కానీ కొందరు ఇసుక కోసం నదులను చెరబడుతూ కొద

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

దేశంల

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడ

పెన్నానది నుంచి ఇసుకను

తరలిస్తున్న ట్రాక్టరు

రామగిరి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరాక ప్రకృతి వనరులకు ప్రమాదం ఏర్పడింది. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఇసుక కోసం నదులను గుల్ల చేస్తుండడంతో అవి రూపురేఖలు కోల్పోయాయి. ఇసుకాసురులు పెన్నానదిని ఆదాయ వనరుగా మార్చుకుని పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా..పెన్నమ్మకు గర్భశోకం ఏర్పడింది. అంతేకాకుండా నదీపరీవాహక ప్రాంతంలో భూగర్భజలమట్టం అడుగంటిపోగా తాగు, సాగునీటి కష్టాలతో జనం అల్లాడిపోతున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న రామగిరి మండలంలోని పేరూరులో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

పెన్నాను చెరబట్టిన ఇసుకాసురులు..

పేరూరులో అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్ట్‌ (పేరూరుడ్యాం) దిగువన పెన్నానది ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. నాణ్యమైన ఇసుక ఇక్కడ పుష్కలంగా లభిస్తోంది.దీంతో కొందరు నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇసుకాసురుల ధన దాహానికి ఆ ప్రాంతంలో భూగర్భజలమట్టం పూర్తిగా పడిపోగా.. బోర్లన్నీ ఎండిపోయాయి. సాగులేక పొలాలన్నీ బీళ్లుగా మారగా...గొంతు తడిపే గుక్కెడు నీటికోసం జనం అల్లాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో జనం వలసబాట పట్టారు.

రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక రవాణా

రామగిరి మండలం కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు ‘మేం చేసిందే చట్టం.. చెప్పిందే న్యాయం’ అన్నట్లుగా వ్యవహరిస్తుండగా.. వారి అనుచరులు, అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. రామగిరి ప్రాంతంలోని సోలార్‌ ప్లాంట్లు, సమీపంలోని కర్ణాటక ప్రాంతంలోని సోలార్‌ ప్రాజెక్టులకు ఇసుక భారీగా అవసరం కావడంతో వారు పెన్నానదిపై కన్నేశారు. నదిని చెరబట్టి రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీ వాహనాలతో తవ్వుకుంటూ రోజూ వందలాది వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

సమాధులనూ వదలని వైనం

పేరూరుకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామంలో ఎవరైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా తనువు చాలిస్తే పెన్నా ప్రాంతంలో పూడుస్తారు. అయితే ఇసుక తోడేళ్లు శ్మశానాలను, పూడ్చిన శవాలను వదలకుండా పుర్రెలున్న వాటినికూడా ఇసుకతోపాటు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు పడి ఎవరి సమాధి ఎక్కడుందో తెలియక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు

ప్రస్తుతం వేసవి సమీపిస్తుండడంతో ఆప్రాంతంలో గుక్కెడు నీటికోసం గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుకాసురుల ధన దాహానికి పెన్నా ఛిద్రంకాగా, భూగర్భజల మట్టం భారీగా పడి పోయింది. ఫలితంగా సమీపంలో ఉన్న కనగానపల్లి, కంబదూరు, ఆత్మకూరు, మండలాల్లో సైతం బోరు బావులు ఎండిపోయాయి. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరిలోనే తాగునీటి తిప్పలు పడుతుంటే...మే, జూన్‌ మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు.

పట్టించుకోని అధికారులు..

రామగిరి మండలం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా.. స్థానిక అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజూ వందలాది ఇసుక ట్రాక్టర్లు పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాల ముందు నుంచే వెళ్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోకపోతే చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో కలిసి ప్రజాఉద్యమాన్ని చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

ఎడాపెడా తవ్వేస్తున్న ఇసుకాసురులు

సమాధులను సైతం పెకలించి

ఇసుక తవ్వకాలు

రోజూ వందలాది ట్రాక్టర్లతో

అక్రమ రవాణా

రూ.కోట్లు కూడబెడుతున్న

ఇసుక మాఫియా

కళ్ల ముందే ఇసుక వాహనాలు వెళ్తున్నా పట్టించుకోని అధికారులు

అడుగంటిపోతున్న భూగర్భజలాలు

తాగు, సాగునీటి ఇబ్బందులతో

అల్లాడిపోతున్న రైతులు, ప్రజలు

గేట్ల పేరుతో కాసిన్ని నీటినీ వదిలేసి...

2023లో వరుణుడు కరుణించడంతో పెన్నా ప్రవహించింది. అప్పటి నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిస్తే పెన్నాలో కాసిన్ని నీళ్లు కనిపించేవి. ఈక్రమంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అధికారులు పేరూరు డ్యాంలో నీరు నిల్వ ఉంచారు. తాగునీటి సమస్య ఉత్పన్నమైతే ఈ నీటిని వాడుకోవచ్చని భావించారు. డ్యాంలో నీరుండటంతో సమీప ప్రాంతాల్లోనూ భూగర్భజలమట్టం సమృద్ధిగా ఉండేది. కానీ పేరూరు డ్యాం గేట్ల మరమ్మతుల పేరుతో ఇక్కడి ప్రజాప్రతినిధులు డ్యాంలోని నీరంతా వదిలేశారు. దీంతో ఈ ప్రాంత వాసులకు కన్నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడ1
1/1

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement