జిల్లా అంతటా మంగళవారం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా
ఈ–కేవైసీ చేయించుకోవాలి
గుంతకల్లు రూరల్: రబీ సీజన్‌లో పంట సాగు చేసి ఈ–క్రాప్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ కూడా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ) రవి కుమార్ సూచించారు. మంగళవారం దోనిముక్కల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి లీనా వసుంధర ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి రవికుమార్ పంట సాగులో తీసుకోవాల్సిన మెలకువలు, డ్రోన్ యాప్ ఉపయోగాలు, ఏపీఏఐఎంఎస్ యాప్ వినియోగం, ఉపయోగాల గురించి తెలియజేశారు.
తిరుపతి – రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: హోలీ పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి – రాక్సౌల్ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 21, 28, మార్చి 7వ తేదీల్లో తిరుపతి జంక్షన్ నుంచి ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (07051) బయలుదేరి రెండవ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ రైల్వేస్టేషన్‌కు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు ఈ నెల 24, మార్చి 3, 10వ తేదీల్లో ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి రెండు రోజుల తరువాత తిరుపతి జంక్షన్‌కు సాయంత్రం 6.30 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైళ్లు రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూరు, కృష్ణ, తాండురూ, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఈ రైళ్లల్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌తోపాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.
జిల్లా అంతటా మంగళవారం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా


