పీఆర్సీ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం
అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ వేయాలని, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ ఎస్‌వీవీ రమణయ్య, బసవరాజు ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక జెడ్పీహెచ్‌ఎస్‌లో టీచర్లతో కలిసి పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రికి పంపారు. ఈ సందర్భంగా ఎస్‌వీవీ రమణయ్య మాట్లాడుతూ 2023 జూలై నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పే రివిజన్ జరగాలని, ఇందు కోసం కమిషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శ్రీనివాస్‌బాబు, దేవదానం, ముక్తియార్, కృష్ణవేణి పాల్గొన్నారు.


