అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలి
అనంతపురం మెడికల్: అత్యవసర సమయాల్లోనే సిజేరియన్ చేపట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గత నెలలో చోటు చేసుకున్న మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. పుట్లూరు మండలానికి చెందిన సరస్వతికి సకాలంలో సిజేరియన్ చేయకపోవడంతో మృతి చెందిందని, ప్రజలకు అవగాహన కల్పించలేకపోయిన వైద్య సిబ్బందికి డీఎంహెచ్‌ఓ మోమో జారీ చేశారు. కష్టతరమైన కేసుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శశిభూషణ్‌రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, పీడియాట్రీషియన్లు డాక్టర్ దినకర్, డాక్టర్ లోక్‌నాథ్, తదితరులు పాల్గొన్నారు.


