డుమ్మా టీచరుకు చివరి అవకాశం | - | Sakshi
Sakshi News home page

డుమ్మా టీచరుకు చివరి అవకాశం

Feb 11 2026 7:31 AM | Updated on Feb 11 2026 7:31 AM

డుమ్మ

డుమ్మా టీచరుకు చివరి అవకాశం

ఎయిర్‌పోర్టుకు స్థల పరిశీలన

కూడేరు: ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి అనువైన స్థలం కోసం బ్రాహ్మణపల్లి వద్ద భూములను మంగళవారం ఆర్డీఓ కేశవనాయుడు పరిశీలించారు. ఆయన వెంట కూడేరు, ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ మండలాల రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడి అరెస్ట్‌

గుంతకల్లుటౌన్‌: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్తను అరెస్ట్‌ చేసినట్లు గుంతకల్లు వన్‌టౌన్‌ పీఎస్‌ సీఐ మనోహర్‌ తెలిపారు. వివరాలను మంగళవారం రాత్రి ఆయన వెల్లడించారు. గుంతకల్లులోని భాగ్యనగర్‌లో నివాసముంటున్న ఆటోడ్రైవర్‌ షాహీర్‌ ఎనిమిదేళ్ల క్రితం షేక్‌ రుక్సార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసై రెండో పెళ్లి చేసుకుంటానంటూ తీవ్ర వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన రుక్సార్‌ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో షాహీర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

పాడి అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు రాయితీ

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ) కింద పాడి అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి 35 శాతం రాయితీతో రుణాలు అందిస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ జి.ప్రేమ్‌చంద్‌ తెలిపారు. స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయ హాలులో అనంతపురం డివిజన్‌ ఏడీలు, డాక్టర్లతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. జిల్లాలో పాడిపశువుల సమాచారాన్ని సేకరించాలన్నారు. అవసరమైతే వైద్యచర్యల్లో భాగంగా ఫార్మసీ పూర్తి చేసిన మహిళల ద్వారా ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎదకు వచ్చిన పశువులకు ఇకపై తప్పనిసరిగా లింగనిర్ధారిత వీర్యం (ఎస్‌ఎస్‌ఎస్‌) ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి చేపట్టాలన్నారు. వేసవిలో గడ్డి, నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, వీఏహెచ్‌ఏల పనితీరు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీడీ డాక్టర్‌ వై.రమేష్‌రెడ్డి, డీఎల్‌డీఏ ఈఓ డాక్టర్‌ జి.వెంకటేష్‌, ఏడీలు డాక్టర్‌ రాధిక, డాక్టర్‌ కేఎల్‌ శ్రీలక్ష్మి, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్‌) ఏడీ డాక్టర్‌ రవిబాబు పాల్గొన్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: దాదాపు ఏడాదిన్నరకు పైగా ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు డుమ్మా కొట్టిన టీచరుకు విద్యాశాఖ చివరి అవకాశం ఇచ్చింది. 10 రోజుల్లో రిపోర్టు చేసుకోకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలిగింపునకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్తే...విడపనకల్లు మండలం హావలిగి జెడ్పీహెచ్‌ఎస్‌లో గణితం టీచరుగా పని చేస్తున్న బద్రీనాథ్‌ 2024, జూలై 15 నుంచి విధులకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ అంశంపై అనంతపురం డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక ఆధారంగా మేజర్‌ పెనాల్టీ కోసం తుది షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయినా ఆయన అందుబాటులోకి రాలేదు. డీఈఓ కార్యాలయానికి ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పది రోజుల్లోపు రిపోర్టు చేసుకోని పక్షంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తొలిగించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు. కాగా, అప్పుల కారణంగానే బద్రీనాథ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సుమారు రూ. 4 కోట్ల మేర అప్పులున్నట్లు తెలిసింది. అతని బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోనే సుమారు రూ. 25 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

డుమ్మా టీచరుకు చివరి అవకాశం 1
1/4

డుమ్మా టీచరుకు చివరి అవకాశం

డుమ్మా టీచరుకు చివరి అవకాశం 2
2/4

డుమ్మా టీచరుకు చివరి అవకాశం

డుమ్మా టీచరుకు చివరి అవకాశం 3
3/4

డుమ్మా టీచరుకు చివరి అవకాశం

డుమ్మా టీచరుకు చివరి అవకాశం 4
4/4

డుమ్మా టీచరుకు చివరి అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement