బుగ్గరామలింగేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గ్రామోత్సవంలో స్వామి ఉత్సవ విగ్రహాలు
గోపూజ అనంతరం యాగశాల ప్రవేశానికి గోవును తీసుకెళ్తున్న దృశ్యం
తాడిపత్రి రూరల్: పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తొలిరోజు తెల్లవారుజామున స్వామివారికి అర్చకులు అభిషేకాలు, నక్షత్ర హారతులు ఇచ్చి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలోని పార్వతీమాతకు కుంకుమార్చనలు అనంతరం విశేష అలంకరణ చేశారు. ఈఓ రామాంజినేయులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు గోపూజ నిర్వహించి, యాగశాల ప్రవేశం చేయించారు. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ స్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల విశేష అలంకరణ అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.
బుగ్గరామలింగేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం


