సేవాలాల్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
గుత్తి: బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్ అఽధికారులను ఆదేశించారు. గుత్తి మండలం సేవాగఢ్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజులపాటు సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముందని గిరిజన సంఘాల నాయకులు, సేవాలాల్ ట్రస్ట్ సభ్యులు చెప్పారన్నారు. భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రస్ట్ సభ్యులతో సమన్వయం చేసుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సేవాలాల్ జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలన్నారు. అనంతరం సేవాలాల్, మాతా జగదాంబ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, సేవాలాల్ ట్రస్ట్ అధ్యక్షులు కేశవ నాయక్, ట్రస్ట్ సభ్యులు అశ్వత్థ నాయక్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, చెర్లోపల్లి సర్పంచు అప్పా వెంకటేష్, గుత్తి మున్సిపల్ కమిషనర్ బబ్బార్‌మియా, ఐఅండ్‌పీఆర్ డీఐపీఆర్‌ఓ బాల కొండయ్య, ఎకై ్సజ్ ఎస్‌ఐ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


