పేదల వ్యతిరేక బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

పేదల వ్యతిరేక బడ్జెట్‌

Feb 15 2026 7:23 AM | Updated on Feb 15 2026 7:23 AM

పేదల వ్యతిరేక బడ్జెట్‌

పేదల వ్యతిరేక బడ్జెట్‌

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన 2026–2027 బడ్జెట్‌ పేదల వ్యతిరేక బడ్జెట్‌గా కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌.. చివరకు మేనిఫెస్టోలోని హామీలనే అమలు చేయలేని పరిస్థితికి వచ్చారు. ‘చంద్రబాబు వల్ల స్వర్ణాంధ్ర సాకారం అవుతోంది.. నారా లోకేష్‌ నాయకత్వంలో విద్యారంగం మెరుగవుతోంది.. పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి పరుగు పెడుతోంది’ అంటూ డబ్బా కొట్టుకున్నారు. గడిచిన 20 నెలల్లో ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కాదు.. నేరాంధ్ర.. అప్పులాంధ్ర.. కబ్జాంధ్ర.. దోపిడీ ఆంధ్రగా సాకారమైంది. ఏరుదాటే వరకు ఓడ మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న అనేలా చంద్రబాబు పాలన సాగుతోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 53.58 లక్షల మంది రైతులకు రూ.10,700 కోట్లు అవసరమైతే రూ.6600 కోట్లు మాత్రమే కేటాయించారు. 12వ పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. 50 ఏళ్లకే పింఛన్‌ అమలు లేదు. నిరుద్యోగ భృతిపై అతీగతీ లేదు. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీల కృష్ణాజలాలను తొలిసారిగా తరలించామని పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అపద్ధాలు చెప్పారు. రైతులు, యువత, విద్యార్థి, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరోసారి మోసం జరిగింది.

– అనంత వెంకటరామిరెడ్డి,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement