దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో దామోదరం సంజీవయ్య 105వ జయంత్యుత్సవం నిర్వహించారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1920లో కుల వివక్ష ఎక్కువగా ఉండేదన్నారు. ఆ సమయంలో దామోదరం సంజీవయ్య పడిన కష్టాలు మాటల్లో చెప్పలేమన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్నో పదవులు చేపట్టారన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. డీఆర్‌ఓ మలోల మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య అడుగు జాడల్లో మనమందరం నడవాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, నాయీబ్రాహ్మణ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, బెస్త కార్పొరేషన్ల డైరెక్టర్లు ఆదినారాయణ, పి.లక్ష్మీ నరసింహులు, రంగాచారి, పవన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్‌రెడ్డి, ఐఅండ్‌పీఆర్ డీఐపీఆర్‌ఓ ఎ.బాలకొండయ్య కుల సంఘాల నాయకులు దాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
రాడ్‌తో కొట్టి చైన్ లాక్కెళ్లాడు
బుక్కరాయసముద్రం: మండల కేంద్రం బుక్కరాయసముద్రంలో శనివారం ఓ మహిళపై అగంతకుడు రాడ్‌తో దాడిచేసి, ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కెళ్లాడు. పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రానికి చెందిన ముత్యాల వెంకటేశు భార్య శ్రీదేవి నార్పల క్రాసింగ్‌లోని గాంధీనగర్ కాలనీ సమీపంలో టీ కేఫ్, క్యాంటీన్ నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం షాపులో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఇనుప రాడ్డుతో తలపై, చేతలపై దాడిచేసి.. ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు చైన్ లాక్కునిపోయాడు. స్థానికులు గమనించి దాడిలో గాయపడిన శ్రీదేవిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ రాంప్రసాద్ పరిశీలించారు. దుండగుడు లాక్కెళ్లిన బంగారు చైన్ రూ.6 లక్షల వరకు విలువ ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. నిందుతుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు


