యువతకు కుచ్చుటోపీ
‘రాష్ట్రంలో యువతకు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ సూపర్ సిక్స్‌లో భాగంగా హామీ ఇచ్చారు. 20 నెలలు దాటినా ఒక్క నిరుద్యోగికీ పైసా ఇవ్వలేదు. బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. అయినా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని ప్రసంగించడం యువతను వంచించడమే. గడిచిన కాలానికి గాను ప్రతి నిరుద్యోగికీ చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. – సాకే చంద్రశేఖర్,
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు


