కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం | - | Sakshi
Sakshi News home page

కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం

Feb 10 2026 7:32 AM | Updated on Feb 10 2026 7:32 AM

కర్తన

కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం

కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన రైతు ఎర్రప్ప తోటలో సోమవారం ఉదయం ఎలుగుబంటి కనిపించింది. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన ఎర్రప్ప.. ఎలుగుబంటిని గమనించి చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులను పోగేసుకుని అక్కడి నుంచి తరిమేశారు.

కుక్కను తప్పించబోయి బీటెక్‌ విద్యార్థి మృతి

అనంతపురం సెంట్రల్‌: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్న బీటెక్‌ విద్యార్థి తనూజ్‌ (23) సోవమారం శ్రీనగర్‌ కాలనీ నుంచి తన నివాసానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన తనూజ్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ జగదీష్‌ కేసు నమోదు చేశారు.

రాష్ట్రస్థాయి త్రోబాల్‌ చాంపియన్‌గా ‘అనంత’

అనంతపురం కార్పొరేషన్‌: లీప్‌ టీచర్స్‌ త్రోబాల్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో అనంతపురం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 8 నుంచి రెండ్రోజుల పాటు గుంటూరులో త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. సోమవారం ఏలూరుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో వరుసగా 26–19, 17–25, 15–9 పాయింట్ల తేడాతో అనంతపురం జట్టు విజయ కేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా విజేత జట్టు క్రీడాకారులను డీఈఓ ప్రసాద్‌బాబు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాస్‌ తదితరులు అభినందించారు.

చెరువులో పడి వృద్ధుడి మృతి

బుక్కరాయసముద్రం: అనంతపురంలోని మున్నానగర్‌కు చెందిన చిన్న ఆంజనేయులు (65) స్థానిక చిక్క వడియార్‌ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. సోమవారం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఆయన కాలు జారీ చెరువు నీటిలో పడ్డాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

35 ఏళ్ల తర్వాత ఒకే చోట..

అనంతపురం సెంట్రల్‌: వారంతా ఒకేసారి పోలీసుశాఖలో ఏఆర్‌ విభాగంలోకి అడుగుపెట్టారు. వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు రావడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం అనంతపురంలోని రహమత్‌ ఫంక్షన్‌ హాల్‌లో కలుసుకుని సంబరాలు జరుపుకున్నారు.

కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం 1
1/2

కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం

కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం 2
2/2

కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement