నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు

Feb 16 2026 7:47 AM | Updated on Feb 16 2026 7:47 AM

నేటి

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులు, కార్యదర్శులతో బిల్‌గేట్స్‌ బృందం సమావేశం కారణంగా పై కార్యక్రమాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. కాన్ఫరెన్స్‌ కారణంగా జిల్లాస్థాయితో పాటు మండల, డివిజన్‌ స్థాయలోనూ రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి రావద్దని సూచించారు.

వర్చువల్‌గా హాజరవ్వాలి

బిల్‌గేట్స్‌ బృందంతో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, కార్యదర్శులతో జరగనున్న సమావేశానికి కలెక్టరేట్‌ నుంచి తనతో పాటు జిల్లా అధికారుల బృందం పాల్గొంటారని కలెక్టర్‌ తెలిపారు. ఆర్‌డీఓలు, మండలస్థాయి అధికారులు వర్చువల్‌గా హాజరు కావాలని ఆదేశించారు.

టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నీ విజేత

‘గంజికుంట ఈగల్స్‌’

వజ్రకరూరు: రాష్ట్రస్థాయి టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నీ విజేతగా గంజికుంట ఈగల్స్‌ జట్టు నిలిచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గంజికుంటలో గ్రామపెద్దల ఆధ్వర్యంలో జనవరి 14న రాష్ట్ర స్థాయి 8వ టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 86 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం గంజికుంట ఈగల్స్‌ జట్టు, హోతూరు రాజా లెవెన్స్‌ జట్టు ఫైనల్‌లో తలపడ్డాయి. హోతూరు రాజా లెవెన్స్‌ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులుచేసింది. అనంతరం గంజికుంట ఈగల్స్‌ జట్టు 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయం సాధించి, ట్రోఫీ కై వసం చేసుకుంది. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి 75 పరుగులు చేసిన గంజికుంట ఈగల్స్‌ బ్యాటర్‌ అసురకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రతిభ కనబరచిన సూర్య (హోతూరు రాజా జట్టు ఆటగాడు సూర్య మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కింది. ఎన్‌ఆర్‌ఏఐఎన్‌ హార్వేస్టింగ్‌ మిషన్‌ డీలర్‌ సుధాకర్‌ సోదరులు రూ.60 వేల నగదు బహుమతితోపాటు ట్రోఫీ అందించారు. రన్నరప్‌గా నిలిచిన హోతూరు రాజా లెవెన్స్‌ జట్టుకు గ్రామానికి చెందిన హాజీ సోదరులు రూ.30 వేల నగదు బహుమతితో పాటు కప్‌ అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ జట్టుకు గ్రామానికి చెందిన బీఆర్‌.అంబేద్కర్‌ కమిటీ వారు రూ.10వేల నగదు, కప్‌ అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ గౌరవాధ్యక్షుడు బీపీ వీరప్ప, సర్పంచ్‌ జయేంద్రరెడ్డి, కార్యవర్గసభ్యులు జక్కల శ్రీని వాసులు, ఆవుల కుళ్లాయప్ప, ప్రదీప్‌, ఓబుళపతి, ఆర్గనైజర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అంతా మా ఇష్టం..

రెడ్డిచెరువుపల్లిలో

టీడీపీ నేతల బరితెగింపు

సాక్షి, పుట్టపర్తి: గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. ఆదాయం కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గ్రామంలో బాగున్న పాఠశాల భవనాన్ని కూల్చి వేసి ఆగమేఘాలపై అక్కడ పంచాయతీ భవన నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల భవనాన్ని కూల్చివేసేందుకు.. కొత్తగా పంచాయతీ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి సవిత ప్రోద్బలంతోనే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతుండడం గమనార్హం. పంచాయితీ భవన నిర్మాణం కోసం వేస్తున్న బేస్‌మెంట్‌ బలంగా లేదని, నాసిరకంగా నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు 1
1/2

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు 2
2/2

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement