సమయానికి రాని వైద్యులు | - | Sakshi
Sakshi News home page

సమయానికి రాని వైద్యులు

Feb 10 2026 7:32 AM | Updated on Feb 10 2026 7:32 AM

సమయాన

సమయానికి రాని వైద్యులు

సిబ్బందితో రోగుల వాగ్వాదం

కూడేరు: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద సోమవారం కూడేరులోని పీహెచ్‌సీలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది సమాచారమివ్వడంతో మండల పరిఽధిలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు తరలి వచ్చారు. వీరికి తోడు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వందల సంఖ్యలో రోగులు కూడా చికిత్స కోసం వచ్చారు. అయితే ఉదయం 9 గంటలకు వైద్యులు హాజరు కావాల్సి ఉండగా 11 గంటలైన రాకపోవడంతో సహనం కోల్పోయిన రోగులు అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పీహెచ్‌సీ డాక్టర్‌ వెంకటప్రసాద్‌ సైతం 104 ద్వారా వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడంతో సమస్య తలెత్తిందని, డాక్టర్‌ ఉషారాణి వచ్చేస్తారని సిబ్బంది చెప్పుకొచ్చారు. చివరకు 11.10 గంటలకు డాక్టర్‌ ఉషారాణి వచ్చి వైద్య సేవలందించారు.

వివాహిత బలవన్మరణం

గుంతకల్లు టౌన్‌: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని గంగానగర్‌కు చెందిన రుక్సార్‌ (27), అనంతపురంలోని కేకే నగర్‌లో నివాసముంటున్న సయ్యద్‌ షామీర్‌ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న షాహీర్‌, తన భార్యాపిల్లలతో కలసి ఏడాది క్రితం గుంతకల్లులోని భాగ్యనగర్‌ ధర్మవరం రైల్వేగేట్‌ వద్ద ఓ అద్దె ఇంట్లోకి మకాం మార్చాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసగా మారి కుటుంబపోషణను పట్టించుకోవడం మానేసి తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న షాహీర్‌ తన భార్యతో గొడవ పడ్డాడు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో భర్త, పిల్లలు నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం నిద్ర లేచిన పిల్లలు ఉరికి విగతజీవిగా వేలాడుతున్న తల్లిని గమనించగానే గట్టిగా కేకలు వేస్తూ రోదించసాగారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సీఐ మనోహర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతురాలి తల్లి షేక్‌ భానూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సమయానికి రాని వైద్యులు 1
1/1

సమయానికి రాని వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement