15 ఎకరాల పశుగ్రాసం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

15 ఎకరాల పశుగ్రాసం దగ్ధం

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

15 ఎకరాల పశుగ్రాసం దగ్ధం

15 ఎకరాల పశుగ్రాసం దగ్ధం

బొమ్మనహాళ్‌: మండలంలోని ఉద్దేహాళ్‌లో శుక్రవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రైతు బోయ రమేష్‌కు చెందిన 15 ఎకరాల్లోని పశుగ్రాసం కాలి బూడిదైంది. గుర్తు తెలియని వ్యక్తి బీడీ తాగి పారేడయంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనతో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. మంటలు చెలరేగుతున్న సమయంలో గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే లోపు పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement