నాకొచ్చినవన్నీ సరిగ్గానే రాశాను.. అయినా మంచి మార్కులు ర
● పరీక్షల్లో చేతిరాత కూడా ముఖ్యమే
● అర్థమయ్యేలా రాయాలి
● దస్తూరిపై సాధన చేయాలంటున్న నిపుణులు
చేతి రాతపై సాధన చేస్తున్న విద్యార్థులు
రాయదుర్గం టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సిన తరుణమిది. ధ్యాసంతా చదువుపైనే నిమగ్నం చేసే విద్యార్థులు కీలకమైన చేతిరాతపై దృష్టి సారించకపోతే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఏడాది పాటు చదివిన అంశాలను రెండున్నర గంటల్లో జవాబు పత్రంపై రాయగలగాలి. పరీక్షల సమయంలో సహజంగా ఆందోళన ఉంటుంది. ఈ ఆందోళనలోనే చేతి రాత అందంగా లేకపోవడం.. మూల్యాంకనం చేసే వారికి అర్థం కాకపోవడం తదితర కారణాలతో మార్కులు తగ్గే అవకాశముంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా దస్తూరిపై సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవి పాటించాలి..
● సమాధాన పత్రంపై రాసే జవాబు సూటిగా ఉండాలి. అక్షరాలు పొందికగా ఉంటే మూల్యాంకన చేసేవారికి సులువుగా అర్థమై కచ్చితమైన మార్కులు వేసే అవకాశం ఉంటుంది.
● పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి.
● సామాన్య, భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును వత్తి పెట్టి రాయకూడదు.
● పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లకు మించి రాయకుండా జాగ్రత్త పడాలి. పదానికి, పదానికి అర సెంటీమీటరు గ్యాప్ ఇవ్వాలి.
● రోజూ చేతిరాతపై కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయగలుగుతారు.
● అక్షరాలు, పదాలు, వ్యాక్యాల మధ్య తగినంత ఖాళీ ఉండాలి.
● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది.
నాకొచ్చినవన్నీ సరిగ్గానే రాశాను.. అయినా మంచి మార్కులు ర


