●గవి మఠం.. గజరాజు ఆగమనం
ఉరవకొండ: ఏనుగమ్మ ఏనుగు... మావూరు వచ్చింది ఏనుగు అంటూ ఉరవకొండలో చిన్నారులు సందడి చేశారు. వివరాల్లోకి వెళితే.. గవిమఠానికి చెందిన ఏనుగు శుక్రవారం ఉరవకొండకు చేరుకుంది. గవిమఠానికి సంబంధించి కర్ణాటకలోని తుమకూరులో ఉన్న మఠం నుంచి ప్రత్యేక వాహనంలో ఏనుగును తీసుకువచ్చి ఉత్సవాలు ముగిసిన అనంతరం తిరిగి తుమకూరులోని మఠానికి చేర్చడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలో శుక్రవారం గవిమఠానికి చేరుకున్న ఏనుగు పీఠాధిపతి, ఉత్తరాధికారి ఆశీస్సులు తీసుకుని పురవీధుల్లో సందడి చేసింది. చాలామంది ఏనుగుకు పండ్లు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.


