అధిక బరువు మోయలేక.. మొరాయింపు!
కళ్యాణదుర్గం: ఓవర్ లోడు వేస్తే ఎక్కడ పడితే అక్కడే ఆగిపోతామంటూ కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. శనివారం కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి ప్రయాణికులతో బయలుదేరిన ఏపీ02 టీసీ 7979 సర్వీసు బస్సు శనివారం స్థానిక అక్కమాంబ కొండ సమీపంలోకి చేరుకోగానే మొరాయించింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి చేర్చారు. సీ్త్రశక్తి పథకం కారణంగా సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడమే ఇందుకు కారణమని ఈ సందర్భంగా పలువురు వాపోయారు.


