విభిన్న ప్రతిభావంత యువతకు ‘ఇగ్నైట్‌’ | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంత యువతకు ‘ఇగ్నైట్‌’

Feb 12 2026 7:24 AM | Updated on Feb 12 2026 7:24 AM

విభిన్న ప్రతిభావంత  యువతకు ‘ఇగ్నైట్‌’

విభిన్న ప్రతిభావంత యువతకు ‘ఇగ్నైట్‌’

స్వయం ఉపాధి దిశగా శిక్షణ

జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌

అనంతపురం క్రైం: విభిన్న ప్రతిభావంత యువత స్వయం ఉపాధి సాధించే దిశగా ‘ఇగ్నైట్‌’ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో అధికారులతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యాచరణ లక్ష్య సాధనలో భాగంగా అనంతపురంలోని రతన్‌టాటా ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణను అందజేస్తున్నట్లు వివరించారు. వ్యాపార ప్రారంభానికి అవసరమైన నైపుణ్యాలు, మార్కెటింగ్‌ విధానాలు, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమగ్ర మార్గదర్శకత్వంపై శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు, దివ్యాంగులు, లింగ వైవిధ్య వ్యక్తులు అర్హులన్నారు. మార్చి 2 నుంచి 16వ తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయంతో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ముందుగా rtih. ananthapuramu@gmail. com మెయిల్‌కు దరఖాస్తులు పంపి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 91003 32660, 77299 32987లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement