జయహో.. భారత్
పాక్‌పై విజయంతో అభిమానుల సంబరాలు
అనంతపురం కార్పొరేషన్: చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత్ ఎప్పుడు విజయం సాధించినా అభిమానుల్లో పట్టలేని ఆనందం. టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత్– పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. జిల్లా కేంద్రంలో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ తదితర ప్రాంతాల్లోకి భారీగా చేరుకున్నారు. యువత బైక్ నడుపుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. మరికొందరు జాతీయ జెండాను పట్టుకుని సందడి చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


