వేడుకగా ఘంటసాల రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానం
అనంతపురం కల్చరల్: ఘంటసాల 52వ వర్ధంతి సందర్భంగా ఘంటసాల సంగీత కళాభారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఘంటసాల పురస్కార వేడుకలు బుధవారం రాత్రి అనంతపురంలో వేడుకగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు సుగుమంచి సురేష్‌బాబు నేతృత్వంలో హైదరాబాదుకు చెందిన ప్రముఖ గాయకుడు, అభినవ ఘంటసాలగా కీర్తికెక్కిన ధూళిపాళ మిత్రకు అవార్డును అందజేశారు. స్థానిక అనంతపురం క్లబ్ వేదికగా సాగిన ఈ వేడుకలో తొలుత సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. అనంతరం డీఆర్వో మలోల, సామాజిక సేవా కార్యకర్త రవికాంత్ రమణ, క్లబ్ సెక్రటరీ కేశవరెడ్డి, జీవీ రామయ్య తదితరులు మాట్లాడుతూ.. ఘంటసాల జీవితంలోని విశేషాలను గుర్తు చేశారు. అనంతరం శ్రీదేవి, సురేష్, ఆదినారాయణ, జ్యోతి , కృష్ణవేణి, సూర్యనారాయణ తదితరులు ఆలపించిన పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.


