●శభాష్.. సమిత్
అనంతపురం ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీ, త్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో అనంతపురానికి చెందిన కోనంకి సమిత్‌చౌదరి ప్రతిభ చాటాడు. సోమవారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. సమిత్‌చౌదరి 99.98 పర్సంటైల్ సాధించాడు. ఈ విద్యార్థి 1 నుంచి 7వ తరగతి వరకు అనంతపురం, 8వ తరగతి నుంచి విజయవాడలో చదివాడు. తల్లి టి.అరుణాదేవి పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ టీచరుగాను, తండ్రి కోనంకి అశోక్‌కుమార్ గుడిబండ మండలం జంబులబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగాను పని చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చాటిన సమిత్‌చౌదరిని పలువురు అభినందించారు.
● జేఈఈ మెయిన్స్‌లో 99.98 పర్సంటైల్‌తో ప్రతిభ


